హైదరాబాద్ నుండి కేరళ టూర్.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు…!

-

వేసవి లో ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. వేసవి లో కేరళ అందాలను చక్కగా చూసి రావచ్చు. ఈ సమ్మర్‌లో మీరు కూడా కేరళ టూర్ వెయ్యాలని అనుకుంటే ఈ ప్యాకేజీ ని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కేరళ హిల్స్ అండ్ వాటర్స్ అనే పేరు తో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రూ.12,000 ధరకే 6 రోజుల ప్యాకేజీ అందుబాటులో వుంది. ఈ రైల్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు కేరళ లోని మున్నార్, అలెప్పీ అందాలు చూడొచ్చు.

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఐఆర్‌సీటీసీ టూరిజం కేరళ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం. ఈ కేరళ టూర్ మొదటి రోజు మంగళవారం హైదరాబాద్‌ లో మొదలు అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కాలి. అప్పుడు రెండో రోజు బుధవారం మధ్యాహ్నం 12.55 గంటలకు పర్యాటకులు ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్‌కు రీచ్ అవుతారు. అక్కడ నుండి మున్నార్ బయల్దేరాలి.

సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. మున్నార్‌లో అన్నీ చూడచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు గురువారం సైట్ సీయింగ్ కి వెళ్ళచ్చు. ఎరవికుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్ ని చూడవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. నాలుగో రోజు శుక్రవారం అలెప్పీ బయల్దేరాలి. బ్యాక్‌వాటర్స్ చూడొచ్చు. రాత్రికి అలెప్పీలో చూడచ్చు.

ఐదో రోజు శనివారం తిరుగు ప్రయాణం ఉంటుంది. ఎర్నాకుళంలో ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆరో రోజు ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చేస్తారు. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.12,130, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.14,510 చెల్లించాలి. కంఫర్ట్‌లో చూస్తే ఒకరికి రూ.14,840, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.17,220 చెల్లించాలి. ఇలా ప్యాకేజీల ధరలు వేరుగా వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news