ఆ బిగ్ లీడర్స్‌కు కేసీఆర్ వలయం..!

-

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2014లో బొటాబోటి మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చి..ఆ తర్వాత ప్రతిపక్షాలని దెబ్బతీసి..మళ్ళీ 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళి..భారీగా సీట్లు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్..ముచ్చటగా మూడోసారి కూడా అధికార పీఠం సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే గతంలో మాదిరిగా  ఈసారి ప్రతిపక్షాలు వీక్ గా లేవు. అటు కాంగ్రెస్ బలంగానే ఉంది..ఇటు బి‌జే‌పి బలపడుతుంది.

ఈ రెండు పార్టీలతో బి‌ఆర్‌ఎస్ పార్టీకి రిస్క్ ఎక్కువగా ఉంది. అయితే తనదైన శైలిలో వ్యూహాలు వేసి..రెండు పార్టీలకు చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికే సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ప్రజలని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు పార్టీలో ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టి..వారి స్థానాల్లో బలమైన అభ్యర్ధులని బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

అదే సమయంలో ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బి‌జే‌పిల్లో ఉన్న బిగ్ లీడర్స్‌కు కే‌సి‌ఆర్ చెక్ పెట్టారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, బి‌జే‌పిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్..ఇలా కొందరు బడా నేతలని తమ తమ స్థానాల్లో ఓడించారు. ఈ సారి కూడా అదే పంథాలో ముందుకెళ్లాలని చూస్తున్నారు.

ఒకవేళ ఓడించకపోయిన పర్లేదు గాని..వారిని పెద్దగా బయటకు రానివ్వకుండా వారి నియోజకవర్గాలకే పరిమితం చేసేలా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. వారిపై బలమైన ప్రత్యర్ధులని నిలబెట్టాలని సెట్ చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇవ్వాలని చూస్తుంటే..కొన్ని చోట్ల అభ్యర్ధులని మార్చి కొత్తవారిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ , బి‌జే‌పిల్లో ఉన్న బడా నేతల చుట్టూ వలయం వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news