హైదరాబాద్‌ వాసులకు అలర్ట్..ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్‌లో ఆషాడ మాసం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఇవాళ, రేపు వారాల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మరుసటి రోజు పూజలు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయన్నారు సీవీ ఆనంద్‌.

సాధారణ ప్రజలు కర్బాల మైదానం, రాణిగంజ్‌, ఓల్డ్‌ రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌, ప్యారడైజ్‌, ఎస్‌బీఐ ఎక్స్‌ రోడ్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్‌, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌, ప్యాట్నీ ఎక్స్‌ రోడ్‌, పార్క్‌ లేన్‌, బాటా, ఝూన్సీమండీ ఎక్స్‌ రోడ్‌, బైబిల్‌ హౌస్‌, మినిస్టర్‌ రోడ్‌, రసూల్‌పురా రూట్లలో ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి మరుసటి రోజు జాతర పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు సీవీ ఆనంద్‌. కాగా, పూజల సందర్భంగా మహంకాళి ఆలయం నుంచి టోబాకో బజార్‌, హిల్‌ స్ట్రీట్‌, సుభాష్‌ రోడ్‌, బాటా చౌరస్తా నుంచి రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు , అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం వరకు, జనరల్‌ బజార్‌ నుంచి ఆలయ మార్గం రోడ్డు, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సెయింట్‌ మేరీస్‌ రోడ్డు, క్లాక్‌టవర్‌ వరకు రోడ్లను మూసివేయనున్నారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news