కేసీఆర్‌ సర్కార్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..త్వరలోనే !

-

కేసీఆర్‌ సర్కార్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాల‌న ఆక్ర‌మ‌ణ‌ల‌కు అడ్డాగా మారిందని.. ఎక్క‌డ చూసినా అధికార పార్టీ నాయ‌కులు అడ్డ‌గోలుగా సర్కారీ భూములను ఆక్రమించుకుంటున్నారని నిప్పులు చెరిగారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నరు. భూదాన్‌ భూములతో పాటు, ప్రాజెక్టుల్లో భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు సేకరిస్తున్న భూములను సైతం రికార్డుల నుంచి మాయం చేసే కుట్ర చేస్తున్నరు. పేదలకు పంపిణీ చేసిన భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌�‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములకు పట్టాలు ఇప్పించేందుకు ఏకంగా సీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ స్థాయిలోనే పైరవీలు నడిపిస్తున్నారని ఆగ్రహించారు.

అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లోనే జరుగుతున్న ఈ అక్రమాలకు సహకరించని ఆఫీసర్లపై ఇటీవల బదిలీ వేటు పడుతోంది. దేవరకొండ డివిజన్‌ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి మండలాల్లో జరిగిన భూదందాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. చింతపల్లి మండలం కుర్మేడులోని 247 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌�‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూదాన్‌ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నయి. వందల ఎకరాల్లోని భూములను మాయం చేసేందుకు రూలింగ్‌ పార్టీకి చెందిన ముఖ్య నేతతో చేతులు కలిపిన పలువురు రియల్టర్లు… రికార్డులనే తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సర్వే నంబర్‌లో భూదాన్‌ భూములు ఉన్నయని… అవి ధరణి వెబ్‌సైట్‌లో కనిపించకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటికి సంబంధించిన సర్వే నంబర్‌ సీసీఎల్‌ఏ రికార్డుల్లో లేకపోవడంతో… పథకం ప్రకారం అక్కడి నుంచి నో ఆబ్జక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌ తెప్పించారు. దీని ఆధారంగా ఫైల్‌ను చింతపల్లి తహసీల్దార్‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. సీసీఎల్‌ఏ నుంచి ఎన్‌వోసీ ఉండడంతో 247 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆ భూముల్లో రియల్టర్లు భారీ స్థాయిలో వెంచర్లు వేస్తున్నరు. రాష్ట్రం మొత్తం ఇలానే భూదాన్ భూముల‌ను అధికార పార్టీ నాయ‌కులు ఆక్ర‌మించుకుంటున్నరు. కేసీఆర్… నీ అక్రమాల ఆట‌లు ఇంకెంతోకాలం సాగ‌వు. త్వరలోనే తెలంగాణ స‌మాజ‌ం నీ స‌ర్కార్‌కు త‌గిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news