ప్లీజ్ అండి బయట తిరగకండి… కరోనా వస్తుంది అండి అర్ధం చేసుకోండి. ఆహా లేదు అండీ మా పాప ఏడుస్తుంది చాక్లెట్ తీసుకొద్దామని ఏడుపు ఆపదే. అరేయ్ బయటకు ఎందుకు వచ్చావ్ రా… బయట ఎందుకు తిరుగుతున్నారు…? ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాం సార్ బోర్ కొడుతుంది అందుకే… సార్ సార్ సార్ కొట్టొద్దు సార్ మళ్ళీ మీకు కనపడేది లేదు. ఎందుకు వచ్చారు బయటకు…? సార్ చికెన్ తీసుకుందాం కదా సండే అని.
చికెన్ కావాలా ప్రాణాలు కావాలా…? ఎన్ని సార్లు చెప్పినా సిగ్గు లేదా…? ఇలా అందరూ కూడా ఏదోక కారణంతో బయటకు వస్తూనే ఉన్నారు. తిట్టినా, కొట్టినా, చెప్పినా, అరచినా, కేసు పెట్టినా ఎవరూ కూడా వినే ప్రయత్నం చేయడం లేదు. చదువుకున్న వాడు అదే బాణీ చదువు లేని వాడు అదే బాణీ, టీవీ లో రోజు చూస్తున్నారు. అయినా సరే మారడం లేదు. వాళ్లకు వచ్చి పోతే పర్వాలేదు గాని పక్కనోడికి అంటిస్తున్నారు.
ఏ పాల వాడికో పేపర్ వాడికో అంటిస్తే…? అందుకే బయటకు వచ్చే వాళ్ళ విషయంలో ఇక ఏ మాత్రం అలసత్వం వద్దని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణా పోలీసులు. సరైన కారణం లేకపోతే మాత్రం ఇక బండి సీజ్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజులు ఆగితే బయటకు వచ్చే సీజ్ కాదు. ఇక ఆ బండి దుమ్ము పట్టి నాశనం అవ్వడమే. బండి నెంబర్ మూడు కమిషనరేట్ల పరిధిలో నమోదు చేస్తారు. పేపర్ మీద కాదు ఆన్లైన్ లో. కారణం లేకుండా వస్తే మాత్రం ఇక అంతే సంగతులు.