ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన రంగమార్తాండ.. ఇందులో రంగస్థల కళాకారుల గురించి వివరంచే ఓ షాయరీ ఉంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. ప్రస్తుతం దీన్ని విడుదల చేయగా ఇందులో చిరు మాట్లాడిన మాటలు అందరిని ఆలోచించేలా చేస్తున్నాయి..
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండ లో రంగస్థలం కళాకారుడు గురించి వివరించే ఓ షాయరి ఉంది.. ముఖ్యంగా ఈ చిత్రాన్ని రంగస్థలం కళాకారుల నేపథ్యంలో తెరకెక్కించారు.. రంగమార్తాండ సినిమా మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ అనే సినిమాకు రీమేక్. అయితే తాజాగా దీన్ని విడుదల చేయగా ఇందులో చిరు మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి..
ఈ షాయరీలో చిరు గంభీరమైన గాత్రం వినిపిస్తుంది ముఖ్యంగా ఇది వినవారందరూ చిరంజీవి తన గురించి తానే చెప్పుకున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు.. ఇందులో ఒక నటుడు జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చాలా గొప్పగా వర్ణించారు దీనికి ఇళయరాజా తన బాణీలను అందించారు.. ఈ షాయరి ఈ విధంగా మొదలవుతుంది.. “నేనొక నటుడ్ని.. చమ్‌కీలబట్టలు వేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను… కాలాన్ని బంధించిన శాసించగల నియంతని నేను… నేనొక నటుడ్ని… నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని… నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని… వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని… వేషం తీస్తే ఎవ్వరికీ ఏమీ కానీ జీవుడ్ని… ” అంటూ సాగిన షాయరీ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంది.