తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందే అని అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో మూడు లక్షల కోట్లు ఉంటే, 3000 ఓట్లు పడ్డాయని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టు అని వ్యాఖ్యానించారు కేఏ పాల్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవదని అందరికీ తెలుసన్నారు. ఇక బిజెపి తెలంగాణలో ఎక్కడా లేదన్న కేఏ పాల్.. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయిందని, అందుకే జాతీయ పార్టీ పెట్టారని అన్నారు. ఇక మరోసారి అంబేద్కర్ పుట్టినరోజునే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.