ఇష్టం లేని ముద్దులు ఇచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి.!

-

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్స్ లేకుండా సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అవి ఉంటేనే సినిమాకు గ్లామర్ వస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యూత్ మరియు కొంత మంది మాస్ మాత్రమే థియేటర్స్ కు వస్తున్నారు. ఇక వాళ్ళకు ఐటమ్ బాంబ్స్ కావలసిందే. అందుకే ఎక్కువ మంది హీరోయిన్స్ తొందరగా ఫేడ్ అవుట్ అయినా కూడా ఐటమ్ సాంగ్స్ చేసుకొంటూ డబ్భులు సంపాదిస్తున్నారు.

అలాంటి వారిలో ముందు వరసలో తెలుగు అమ్మాయి అంజలి కూడా ఉంది. పాత్రలు వస్తే పాత్రలు, లేకుంటే, సాంగ్స్ చేసుకుంటూ వెళ్లిపోతుంది.ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి ముద్దుసీన్లు, ఘాటు సన్నివేశాల లో నటించడం గురించి చెబుతూ  తాను పడ్డ భాద గురించి చెప్పింది.

మనం నటిగా ఏలాంటి పరిస్థితి లో ఉన్నా కూడా మనం పాత్రకు వంద శాతం న్యాయం చేయాలి. ‘కొన్నిసార్లు పాత్రకు తగ్గట్లు ముద్దుసీన్లలో నటించాల్సి వస్తుంది. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం వంటి సంఘటనలు జరిగినప్పడు మనుసులో కంపరంగా ఉంటుంది.అలాగే ఘాడమైన సీన్లు చేసేటప్పుడు విపరీతమైన బాధలో ఉంటాను. అలాంటి సీన్ల లో నటించినప్పుడు  క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అంటూ తన మనుసులో భాద వెళ్లగక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news