కాంగ్రెస్తో పొత్తుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తాము హస్తం పార్టీతో శాశ్వత పొత్తేమీ పెట్టుకోలేదు అని అన్నారు. దేశాన్ని రక్షించడం కోసమే ఆ పార్టీతో జతకట్టాం.బీజేపీని ఓడించడమే మా లక్ష్యం అని తెలిపారు. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లోనే కాంగ్రెస్తో పొత్తు. పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ మధ్యే పోటీ. నేను మళ్లీ జైలుకు వెళ్లడం సమస్య కాదు. నన్ను ఎన్నిరోజులు జైల్లో పెట్టినా పోరాటం ఆపను’ అని ఓ ఇంటర్వ్యూలో అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే,అనారోగ్య కారణాలు దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును కేజ్రీవాల్ ఇటీవల ఆశ్రయించగా.. జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.