నేను పేకాట ఆడతా – ఏపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

-

క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ తారలతో చీకోటి ప్రవీణ్ కు సంబంధాలు బయటికి వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావుకు చీకోటి ప్రవీణ్ తో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై బాలినేని స్పందిస్తూ. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ తో తనకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.” నేను క్యాసినోకి ఎప్పుడన్నా పోయ్యి వస్తుంటా..నేను పేకాట ఆడతానని నేనే ఒప్పుకుంటున్నాను. చీకోటి ప్రవీణ్ తో కానీ హవాలతో కానీ నాకు సంబంధం లేదు.నేను ఉన్న విషయాలు ఒప్పుకుంటా. డ్రామాలు చేయటం రాదు. నాకు ప్రవీణ్ తో సంబంధాలు ఉంటాయని భావిస్తే ఎవరైనా విచారణ చేయించుకోవచ్చు.ప్రతీదానికి నాపై ఆరోపణలు చేయటం సరికాదు.బురద చల్లే ప్రయత్నం మంచి పద్దతి కాదు.”ఏ విధమైన విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు బాలినేని.

Read more RELATED
Recommended to you

Latest news