రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లను కావాలంటే మళ్లీ టార్చర్ పెడతా..!!

-

రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. ఇప్పుడు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో షార్ట్ లిస్ట్ కు ఎంపిక అయ్యింది.

దానితో అందరూ RRR టీమ్ కు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచంలో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR ఏదైనా ఒక్క అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ నామినేట్ కావడంతో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ పాట కోసం ఎంతో అద్భుతమైన డాన్స్ చేసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి కూడా ఈయన ప్రస్తావించారు. ఈ పాట అనేకమంది గుండెల్లో చేరుకోవడం కోసం నేను మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాను. ఇలా టార్చర్ చేసినందుకు సారీ అయితే ఇంకోసారి ఇలా టార్చర్ చేయాల్సి వస్తే   మళ్లీ సీన్ అదే రిపీట్ అయ్యిద్దని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా ఆస్కార్ కోసం నేనెప్పుడూ కలలో కూడా ఊహించలేదు. కానీ అభిమానులు మాత్రం వస్తుందని ఊహించారు. వారే నన్ను ముందుకు నడిపించారు అంటూ అభిమానులకు అందరికి థాంక్యూ చెప్పాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news