గత ఎన్నికల్లో తెలంగాణలో ఊహించని ఫలితాలు కొన్ని చోట్ల వచ్చాయి..గెలిచేస్తారనుకున్న నాయకులు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అలా సంచలన ఫలితాలు వచ్చిన స్థానాలు అంబర్‌పేట, కొడంగల్..అనూహ్యంగా బిజేపిలో సీనియర్ నేత కిషన్ రెడ్డి..అంబర్‌పేటలో పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి ఎరగని నాయకుడుగా వస్తున్న కిషన్ రెడ్డి..అంతకముందు హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి..2009, 2014 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి గెలిచారు.
ఇక 2018 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో కిషన్ రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్ధి కాలేరు వెంకటేశం చేతిలో కేవలం 1000 ఓట్ల తేడాతో కిషన్ రెడ్డి ఓడిపోయారు. అటు కొండగల్ బరిలో 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి..2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి అనూహ్యంగా బిఆర్‌ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతులో ఓడిపోయారు. అయితే ఈ ఇద్దరు నేతలు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు.
బిజేపి తరుపున సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గెలవగా, కాంగ్రెస్ తరుపున మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు. అటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు..తెలంగాణ బిజేపిలో అగ్రనేతగా ఉన్నారు. ఇటు రేవంత్ టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమ సొంత స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఈ సారి వీరికి గులాబీ పార్టీ చెక్ పెట్టడం కష్టమే. ఇటు అంబర్‌పేటలో కిషన్ రెడ్డి బలం పెరిగింది..అక్కడ ఆయన గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నై. అటు కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి సైతం గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు నేతలని ఈ సారి గెలవకుండా ఆపడం కష్టమే అని చెప్పవచ్చు.