టీ-20 వరల్డ్‌కప్‌ తేదీలను ప్రకటించిన ఐసీసీ

టీ-20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీ యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ దేశాలకు మార్చుతున్నట్లు ఇవాళ ఐసీసీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌ 17 వ తేదీ నుంచి నవంబర్‌ 14 వ తేదీ వరకు టీ 20 వరల్డ్‌ కప్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్న ఐసీసీ…దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, ద షేక్‌ జయిదా స్టేడియం (అబుదాబి), ద షార్జా స్టేడియం, ఒమన్‌ క్రికెట్‌ అకాడమీ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ టోర్నమెంట్‌ తొలి రౌండ్‌లో. అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయని.. ఒమన్‌, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్‌లు ఆడనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ జట్ల నుంచి నాలుగు టీంలు.. సూపర్‌ 12 కు ఎంపిక అవుతాయని.. ఆ జట్లు 8 ఆటోమెటిక్‌ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయని ట్వీట్‌ చేసింది ఐసీసీ.కాగా… ఇటీవలే.. టీ-20 వరల్డ్‌ కప్‌ వేదికను యూఏఈకి తరలించాలని ఐసీసీని బీసీసీఐ కోరిన సంగతి తెలిసిందే.