ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వచ్చేసాయి. టెస్ట్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ని ఐసీసీ విడుదల చేసింది. ఇటీవల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలిసారి టాప్ టెన్ లో స్థానం దక్కలేదు. నాలుగు స్థానాలు కోల్పోయి 13వ ప్లేస్ కు చేరుకున్నాడు. 2016 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. ఇటు యువ ఆటగాడు రిషబ్ పంత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు వ టెస్టులో సెంచరీ, ఆఫ్ సెంచరీతో అలరించాడు. దీంతో అతడు టాప్ 5 లో కి వెళ్ళాడు.
టెస్ట్ మ్యాచ్ కు ముందు రిషబ్ పంత్ పదవ స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ ముగియగానే 5వ స్థానానికి ఎగబాకాడు. ఇక కరోనా సోకడంతో టెస్ట్ మ్యాచ్ కి దూరమయిన రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారాడు. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం బ్యాటింగ్ విభాగంలో జో రూట్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. బౌలర్ల విభాగంలో తొలి స్థానంలో నిలిచాడు ప్యాట్ కమ్మిన్స్.