దాదాపు ఐదేళ్ల తర్వాత వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి…జులై 8,9 తేదీల్లో గుంటూరులోని కాజ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించాలని అధికార వైసీపీ సిద్ధమైంది..ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా మరొకసారి ‘పవర్’ దక్కించుకోవడమే లక్ష్యమని వైసీపీ శ్రేణులు చాటి చెప్పనున్నాయి. వైసీపీ ఆవిర్భావించక..2011లో మొదటి ప్లీనరీ సమావేశాలు ఇడుపులపాయలో జరిగాయి.
ఇక 2017లో రెండోసారి జరిగాయి..గుంటూరు జిల్లా కాజ సమీపంలో జరిగాయి…ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్ ని వైసీపీ కొనసాగిస్తూ..ఈ 2022 ప్లీనరీ సమావేశాల్ని సైతం అదే గుంటూరు జిల్లా కాజలో నిర్వహిస్తున్నారు. అంటే ఈ ప్లీనరీ ద్వారా అధికారం సాధించడమే టార్గెట్ అని వైసీపీ చెప్పకనే చెబుతుంది.
అయితే 2017లో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది…అప్పుడు టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది…నిదానంగా జగన్ బలం పెరుగుతూ రావడంతో..ఆ ప్లీనరీ సమావేశాలు సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు వైసీపీనే అధికారంలో ఉంది..ఇంకా అధికారంలో ఉన్నారు కాబట్టి..భారీ స్థాయిలో సక్సెస్ చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మినీ మహానాడు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే..జనం భారీగా వచ్చారు. ఇక దాని కంటే భారీగా ప్లీనరీ సమావేశాలని నిర్వహించాలని వైసీపీ భావిస్తుంది.
ఈ సమావేశాల ద్వారానే టీడీపీ విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తుంది. మంచి వాగ్ధాటి ఉన్న నేతల చేత మాట్లాడించి..టీడీపీకి కౌంటర్లు ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా వైసీపీ శ్రేణులు హాజరయ్యేలా ప్లాన్ చేశారు. ఏపీ చరిత్రలో గుర్తుండిపోయేలా సభని నిర్వహించడానికి వైసీపీ సిద్ధమైంది.
అలాగే తాము అమలు చేస్తున్న పథకాలు…అభివృద్ధి కార్యక్రమాలని సవివరంగా వివరించనుంది. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు-ఈనాడు-టీవీ5-ఆంధ్రజ్యోతిలకు దుష్టచతుష్టయం అని పేరు పెట్టి…యెల్లో మీడియా దుష్ప్రచారాలని ప్లీనరీ వేదికగా తిప్పికొడతామని వైసీపీ అధిష్టానం అంటుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది.
ఇక్కడ నుంచి పార్టీ పరంగా జగన్ యాక్టివ్ అయ్యి..నియోజకవర్గాల్లో వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలకు చెక్ పెట్టి, నేతలకు ఉన్న సమస్యలని పరిష్కరించి…పార్టీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేస్తారని తెలుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికలపై జగన్ హింట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2017 ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాలు ప్రకటించి ప్రజలని ఆకర్షించారు…ఇప్పుడు 9 తీర్మానాలని ఆమోదించుకుని 2024 ఎన్నికల టార్గెట్ గా ఇంకా తాము అమలు చేయబోయే కొత్త కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద మరొకసారి పవర్ లోకి రావడమే లక్ష్యంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు.