మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అయితే.. ఐసీఐసీఐ ఐమొబైల్ యాప్‌లోకి వెళ్లి.. అందులో పేలేటర్ ఆప్షన్‌పై యాక్టివేట్ నవ్‌ను క్లిక్ చేయండి. అప్పుడు మీకు వాళ్లు కొన్ని రూల్స్ చూపిస్తారు. అది చదువుకొని ఓకే పైన క్లిక్ చేయండి.
మీకు సడెన్‌గా కొంత డబ్బు అవసరం వచ్చిందనుకోండి.. ఏం చేస్తారు? మీదగ్గర ఏవైనా సేవింగ్స్ ఉంటే దాంట్లో నుంచి ఖర్చు పెడతారు. లేదంటే ఎవరినైనా అప్పు అడుగుతారు. లేదా ఏదైనా బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే.. ఎవరు డబ్బులు ఇచ్చినా ఊరికే ఇవ్వరు కదా. దానికి అంతో ఇంతో వడ్డీ తీసుకుంటారు.
అయితే.. ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూపాయి వడ్డీ తీసుకోకుండా అప్పు ఇస్తోంది. అవును.. మీరు తీసుకున్న అప్పుకు ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అసవరం లేదు. మీరు ఎంత తీసుకుంటారో.. అంతే డబ్బును తిరిగి చెల్లిస్తే చాలు. కాకపోతే.. దానికి ఓ టైమ్ పరిమితి ఉంటుంది. ఆలోపు కట్టేయాలి.
దాన్నే పేలేటర్ అని అంటారు. పేలేటర్ ద్వారా వడ్డీ లేకుండా రుణాన్ని పొందొచ్చు. దీన్నే డిజిటల్ క్రెడిట్ కార్డు అని కూడా అనొచ్చు. పేలేటర్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అయి ఉండాలి.
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అయితే.. ఐసీఐసీఐ ఐమొబైల్ యాప్‌లోకి వెళ్లి.. అందులో పేలేటర్ ఆప్షన్‌పై యాక్టివేట్ నవ్‌ను క్లిక్ చేయండి. అప్పుడు మీకు వాళ్లు కొన్ని రూల్స్ చూపిస్తారు. అది చదువుకొని ఓకే పైన క్లిక్ చేయండి.
తర్వాత మీ పర్సనల్ డిటెయిల్స్, ఆధార్ నెంబర్, డెబిట్ అకౌంట్ డిటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ అనండి. తర్వాత మీరు మీ పేలేటర్ అకౌంట్ కోసం వర్చువల్ పేమెంట్ అడ్రస్(వీపీఏ)ను క్రియేట్ చేసుకోవాలి. అది.. pl.మీ మొబైల్ నెంబర్@icici తో క్రియేట్ అవుతుంది. ఆ పేమెంట్ అడ్రస్ ఉపయోగించి మీరు లావాదేవీలు చేసుకోవచ్చు.
మీకు అర్జెంట్‌గా డబ్బు కావాల్సి వస్తే.. మీ పేలేటర్ వీపీఏ అడ్రస్‌తో ఇతర వాలెట్లకు డబ్బును బదిలీ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు. మీకు ఇచ్చిన లిమిట్‌ను ఉపయోగించుకున్న తర్వాత 45 రోజుల్లో పేమెంట్ చేస్తే చాలు. మళ్లీ మీకు లిమిట్‌ను ఇస్తారు. మరి.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఐసీఐసీఐ కస్టమర్ అయితే వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి పేలేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వడ్డీ లేకుండా లోన్ పొందండి.