శ‌ర్వా చ‌ర‌ణ్ తోడ‌ల్లుడు కాన‌ట్లేనా?

-

యంగ్ హీరో శ‌ర్వానంద్- రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ర్టీలో బెస్ట్ ప్రెండ్స్. మెగా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు. ప్రోఫెష‌న‌ల్ కెరీర్ హ్యాపీగానే ఉంది. ఆ కార‌ణంగానే చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు…ఉపాస‌న చెల్లెల్ని శ‌ర్వాకి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్న‌ట్లు స‌రిగ్గా రెండు సంవ‌త్స‌రాల క్రితం ఓ వార్త వినిపించింది. ఆ రూమ‌ర్ ని త‌ర్వాత మెగా స‌న్నిహిత వ‌ర్గాలే ధృవీక‌రించాయి. చ‌ర‌ణ్ కి తోడ‌ల్లుడు కాబోతున్నాడంటూ అతి త్వ‌ర‌లోనే విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌నున్నారని వెల్ల‌డించాయి. అటు పై ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని బ‌హిర్గతం చేసాయి. అయితే త‌ర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు. పెళ్లికి సంబంధించిన విష‌యం కావ‌డంతో మీడియా కూడా పెద్ద‌గా హైటైల్ చేయ‌లేదు.

శ‌ర్వా చ‌ర‌ణ్ తోడ‌ల్లుడు కాన‌ట్లేనా?

అంత బ‌లంగా వినిపించిన వార్త ఒక్క‌సారిగా తుస్సుమంది. దీంతో అస‌లేమైంది? అంటూ ఇండ‌స్ర్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి విష‌యాన్ని మెగా స‌న్నిహితు వ్ద‌ క‌ద‌ప‌గా మౌనం వ‌హించ‌డం జ‌రిగింది. శ‌ర్వా పేరు ఎత్తదానికి కూడా ఇష్ట‌ప‌డ లేదు. కొణిదెల‌ ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ లో అయితే ఆ విష‌యం గురించి అస‌లు మాట్లాడ‌వద్దు అంటూ..అవ‌న్నీ కేవ‌లం ఆఫీస్ బ‌య‌ట మాత్ర‌మేన‌ని అంటున్నాయి. మ‌రి శ‌ర్వాపై ఇంత‌గా వ్య‌తిరేక‌త రావ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం తెలియలేదు. నాడు మా శ‌ర్వానంద్ అంటూ చంక‌లు గుద్దుకున్న వాళ్లంతా….ఇప్పుడు మాకేం తెలియ‌ద‌న్నుట్లు ఉండ‌టం కాస్త వింత‌గానే అనిపిస్తోంది. మ‌రి బ్యాకెండ్ ఏం జ‌రిగిందో తెలియాల్సి ఉంది.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ఫుల్ బిజీ. కీర‌వాణి, ర‌ణ‌రంగం, 96 రీమేక్ సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే శ్రీకారం అనే సినిమా కూడా ప్రారంభించాడు. ఇలా ఒకేసారి నాలుగు సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఆయ‌న గ‌త సినిమా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన అంచ‌నాల‌ను అందుకోని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సినిమాల‌తో హిట్లు కొట్టి రేసులో ముందుండాల‌ని క‌సిగా ప‌నిచేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news