తెలంగాణ కీలక నిర్ణయం.. ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డు

-

హైదరాబాద్​లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్​తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్​ నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. ఆ యాప్‌లో సంబంధిత యాజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని చెప్పారు.

ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు అర్వింద్‌కుమార్‌ సూచించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌, 040 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news