వైఎస్ వివేకా హత్యకు రూ. 40 కోట్ల డీల్…గొడ్డలి తెచ్చింది ఎవరంటే !

-

వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ వేసింది. సీబీఐ వేసిన కౌంటర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కేసులో A2 గా జన్న నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ… వజ్రాలు పేరుతో ,విలువైన రాళ్లు విక్రయాలు చేసే వాడని సునీల్ బెయిల్ పిటిషన్ కౌంటెర్‌ లో పేర్కొంది. నకిలీ వజ్రాలు తీసుకొచ్చి కథనాన్ని అల్లి వివేకాను మోసం చేసేందుకు ప్రయత్నం చేశాడని..వజ్రాలు రంగురాళ్లు బూటకమని తెలుసుకొని సునీల్ యాదవ్ ను హెచ్చరించాడని సీబీఐ తెలిపింది.

వివేకానంద రెడ్డి అప్పటినుండే సునీల్ యాదవ్ కు నచ్చలేదని… ఎర్ర గంగిరెడ్డి ద్వారా వివేకానంద రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని పేర్కొంది సీబీఐ. రూ.40 కోట్ల డీల్ కుదరడంతో సునీల్ యాదవ్ ఈ హత్య కేసులో కీలకంగా వ్యవహరించాడని తెలిపింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు కౌంటర్లో పేర్కొన్న సిబిఐ… వివేకానంద రెడ్డి మృతి సమాచారం YS అవినాష్ రెడ్డి కు ముందే తెలుసు అని పేర్కొంది. ఘటన జరిగిన ప్రదేశంలో సాక్షాలను చేరిపివేయడం లో కూడా అవినాష్ పాత్ర ఉందని తేల్చింది సీబీఐ.

 

ఈ హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్, గజ్జల ఉమా శంకర్ రెడ్డి ,దస్తగిరి ఉదయం ఐదు గంటల 20 నిమిషాలకు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తెలిపిన సిబిఐ…వీరి ముగ్గురు ప్రమేయం బయటికి రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. నిందితుడు శివశంకర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి జాగ్రత్త తీసుకున్నారు… వివేకా మృతి చెందిన విషయంపై మూడో వ్యక్తి నుండి సమాచారం రాగానే నిందితుల వెళ్లారని పేర్కొంది. అవినాష్ రెడ్డి ఇంటి నుండే వివేకా ఇంటికి వెళ్లారని పేర్కొన్న సీబీఐ…వివేక మృతి విషయాన్నీ తెలుసుకొని అవినాష్ రెడ్డి తో పాటు శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రమణారెడ్డి పిఎ, రాఘవరెడ్డి పిఎ చేరుకున్నారని పేర్కొంది. బెడ్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకానంద రెడ్డి ని చూసి, గుండెపోటుతో మరణించారని స్థానిక రాజకీయ నాయకురాలు శశికళకు సమాచారం అందించారని పేర్కొంది.

 

ఆ తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి తన మొబైల్ ఫోన్ నెంబర్ నుండి రెండు నెంబర్లకు కాల్ చేసి వివేకానంద రెడ్డి మృతి పై సమాచారం అందించాడు…. దీనికోసం పీఏ రాఘవరెడ్డి మొబైల్ నెంబరు కూడా ఉపయోగించినట్లు గుర్తించామన్నారు. అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్యకు కాల్ చేసి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని తెలిపారని.. భారీగా రక్తపు మరకలు గాయాలు స్పష్టంగా చూసినప్పటికీ ఘటన స్థలానికి త్వరగా రావాలని సిఐని వైయస్ అవినాష్ రెడ్డి కోరలేదని తెలిపింది సీబీఐ. కేవలం మూడు, నాలుగు మంది కానిస్టేబుల్స్ ను మాత్రమే పంపించాలని కోరారని..బందోబస్తు పేరుతో నలుగురు కానిస్టేబుల్ ని రప్పించాడని పేర్కొంది. వైయస్ వివేకానంద రెడ్డి గుండెపోటు తీవ్ర రక్తపు వాంతులు రావడంతో సహజంగా మరణించాడు అంటూ డ్రామా క్రియేట్ చేశారని.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య రూపకల్పనను ఉద్దేశపూర్వకంగానే అవినాష్ రెడ్డి దాచిపెట్టినట్లు గుర్తించామంటుంది సిబిఐ. కుట్రపూరితంగా గుండెపోటు రక్తపు వంతులను బూటకు కథనాన్ని అల్లారని పేర్కొన్న సిబిఐ…గుండెపోటు అని నమ్మించడానికి నిందితులంతా కూడా చాలా చురుగ్గా పనిచేసినట్లు పేర్కొంది సిబిఐ.

Read more RELATED
Recommended to you

Latest news