ఎగిరే కాకి మీ మీద రెట్ట వేస్తే భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట..

-

హిందూ సంప్రదాయంలో కాకులకు చాలా ప్రాధాన్యం ఉంది. కాకులు మన జీవితంలో జరిగే మంచి చెడులను అంచనా వేయగలవు. ఇంటి ముందు కాకి అరిస్తే.. చుట్టాలు వస్తున్నారని అనుకుంటాం. కాకులు మరణవార్త తెస్తాయని కూడా చాలా మంది నమ్ముతారు. ఈరోజు మనం కాకి శాస్త్రం ప్రకారం.. కాకులను ఎప్పుడు చూడం శుభప్రదం ఎప్పుడు చూడకూడదు అనే విషయాలను తెలుసుకుందాం.

ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే మున్ముందు ప్రమాదం పొంచి ఉంటుందని అర్థం. మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారు. ఇంటి పై కప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతోందని అంటున్నారు.

ఎగురుతున్నప్పుడు కాకి ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే అది చెడును కలిగిస్తుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందట.

కాకి ఎగురుతున్నప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాకడం చాలా శుభ సంకేతమట. త్వరలో మీకు చాలా డబ్బు వస్తుంది. అయితే కాకి ఎగురుతూ తలకు తగిలితే, జాగ్రత్త, శరీరం తీవ్రంగా క్షీణిస్తుంది, ఆర్థిక కష్టాల వల్ల ఆయుష్షు తగ్గిపోతుందట.

ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే.. త్వరలో డబ్బే డబ్బు. అలాగే కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్లు చూడటం కూడా శుభసూచకమే. మీకు త్వరలో డబ్బు వస్తుంది. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరుపులు వినడం శుభప్రదమని చెబుతారు.

కాకి ఇంటి దగ్గరికి వచ్చి ఆరిస్తే ఆ రోజు మీ ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం ఉందని అంటారు. కొంతమంది తెల్లవారుజామునే ఇంటి పై కప్పుపై ఉన్న కాకులకు ఆహారం వేసి వారి దోషాలు పోగొట్టుకుంటారు.

విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు. పితృ పక్షంలో కాకిని చూడటం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. పితృ పక్షంలో ఎంతో భక్తితో కాకులకు ఆహారం అందజేయడానికి కూడా ఇదే కారణం. కాకి ద్వారానే పూర్వీకులు తమ రాకను సూచిస్తారని భావిస్తారు.

ఇది కాకి కథ.. ఇవన్నీ నమ్మాలా గరువుగారూ అంటే.. నమ్మడం నమ్మక పోవడం మీ ఇష్టం.. పండితులు, శాస్త్రాలు మాత్రం ఇవే చెప్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news