రేవంత్ ఎన్ని ప్రగల్భాలు పలికినా భంగపాటు తప్పలేదు అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు బిజెపి ఓట్లు 22 శాతం పెరిగితే.. కాంగ్రెస్ కి ఒక్క శాతం కూడా పెరగలేదు అని అన్నారు. రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఐదేళ్ళు పాలన కొనసాగించాలని కోరుకుంటున్నాం.
వారంతట వారు కొట్లాట పెట్టుకొని పడిపోతే మేమేం చేస్తాం. ప్రజలకు నచ్చకపోతే బండకేసి కొడతారు.తెలంగాణ ప్రజలు మా మీద పెట్టిన నమ్మకం విశ్వాసం ఒమ్ముకానివ్వం అని తెలిపారు. తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం.దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా..
ఆత్మగౌరవం నిలబడాలన్నా మోడీ గారికే మా ఓటు అని ప్రజలు వేశారు. అసెంబ్లీలో 15 శాతం ఉన్న ఓటు బ్యాంక్ 35 కి పెరిగింది. కానీ అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, డబ్బులు పంచినా వారి ఓటు శాతం పెరగలేదు. రాబోయే ప్రభుత్వం బీజేపీదే. ఆరునెలల కాలంలోనే ఛీ అనిపించుకున్న సిఎం రేవంత్ మల్కాజిగిరి నా సీటు అని ప్రగల్భాలు పలికారు అని మండిపడ్డారు.ఎన్ని విషప్రచారాలు చేసినా, సిఎం కుటుంబసభ్యులు స్వయంగా డబ్బులు పంచిన భంగపాటు తప్పలేదు అని ఈటెల రాజేందర్ అన్నారు.