స్టీల్ ప్లాంట్ అమ్మితే కేసీఆర్ కొంటారు – తోట చంద్రశేఖర్

-

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి తాము ముందుకు వెళ్లడం లేదని వెల్లడించారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఏపీ బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్.

స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి కాపాడేందుకు ఆంధ్ర పార్టీలు ప్రయత్నించడం లేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటినుండి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మితే బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొంటారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారని వెల్లడించారు తోటా చంద్రశేఖర్. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది చనిపోయారన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news