ఇల్లు, వాహనాలు వంటివి కొనాలన్నా… ఏదైనా వ్యాపారం చెయ్యాలన్నా మనకి డబ్బు కావాలి. ఒకేసారి అంత డబ్బు లేనప్పుడు మనం లోన్ తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ రుణాలను మంజూరు చేసే బ్యాంకర్లు సదరు వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తారు. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ వున్నా సరే లోన్ తీసుకోవచ్చు. అది ఎలా అనేది చూస్తే..
సాధారణంగా ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. వాటిలో ముఖ్యంగా సిబిల్ స్కోర్ చూస్తారు. సిబిల్ స్కోర్ అనేది ఎవరికైనీ 1000 పాయింట్లకు లెక్కిస్తారు. అందులో కూడా రెడ్ జోన్, డేంజర్ జోన్, సేఫ్ జోన్ లాంటివి ఉంటాయి. సాధారణంగా 550 కంటే ఎక్కువగా స్కోర్ ఉంటే లోన్ ఇస్తారు. కొన్ని ఫిన్ టెక్ సంస్థలు రూ.10,000-50,000 వరకు రుణాన్ని ఇస్తున్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే సిబిల్ లెక్కలోకి తీసుకోకుండా కేవలం మొబైల్‌కి ఎస్‌ఎంఎస్ రూపంలో వచ్చే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అంచనా వేస్తాయి.
మరి కొన్ని ఫిన్ టెక్ సంస్థలు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వ్యక్తులకు మాత్రమే రుణాన్ని మంజూరు చేస్తాయి. వీటిని తీసుకున్న తర్వాత సకాలంలో మనం డబ్బులను చెల్లించినట్లయితే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు లోన్ ఇవ్వవు. అలాంటి సందర్భంలో డిజిటల్ లెండర్ల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తే.. మన సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంది.