ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు లో మరో ఎదురుదెబ్బ

అమరావతి : జగన్ సర్కార్ కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల పై కాలేజీల అసోసియేషన్, స్టూడెంట్లు వేసిన పిటీషన్ల పై ఇవాళ హై కోర్టు లో విచారణ జరిగింది. అయితే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విషయం లో ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.

highcourt
highcourt

ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ను కొట్టి వేసింది ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు. ప్రస్తుత విద్యా సంవత్సరాని కి యధా విధిగా అడ్మిషన్లు కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్లైన్లో నిర్వహించవచ్చని సూచనలు చేసింది ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు. ఈ విద్యా సంవత్సరానికి గతంలో మాదిరిగా అడ్మిషన్లు నిర్వహించాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించిన విధంగా నడుచుకోవాలని సూచనలు చేసింది హై కోర్టు.