మూడు నాలుగు రోజుల్లో కరోనా కంట్రోల్ అవ్వకపోతే…?

-

చైనా వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఊహించని విధంగా ఈ వైరస్ తీవ్రతకు అక్కడ భారీగా మరణాలు నమోదు అవుతున్నాయి. అక్కడి ప్రభుత్వ౦ ఎన్ని చర్యలు చేపట్టినా సరే కరోనా వైరస్ ను అడ్డుకోలేక నానా అవస్థలు పడుతుంది. ఇప్పటి వరకు ఆ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ కనుక్కోలేదు. అయితే దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే మూడు నాలుగు రోజుల్లో వైరస్ అదుపులోకి రాకపోతే కనీవినీ ఎరుగని నష్టం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ చనిపోయింది – 361, వ్యాధిబారిన పడ్డవారు – 17,205, నిపుణుల అంచనా – రాబోయే వారంలో కనీసం 75 వేలమంది వ్యాధిబారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో పదిరోజుల్లో మరణాలు కొన్ని వేలు ఉండే అవకాశం ఉందట.

ఇప్పుడున్న ఉధృతి అలాగే కొనసాగితే వచ్చే నెలరోజుల్లో లక్షమంది చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా భయంగొలిపే విషయం ఏమిటంటే … ఒక వ్యక్తికి జబ్బు బయటపడే లోపలే అదే వ్యక్తి నుండి అప్పటికే కనీసం నలుగురికి సోకుతుందని అంటున్నారు. ఇది మానవాళికి పెను సవాల్ అంటున్నారు. త్వరగా మందు కనుక్కోలేకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news