ఈ రాశుల వాళ్లు తాబేలు ఉంగరం ధరిస్తే అన్నీ కష్టాలే

-

మీరు చూసే ఉంటారు.. చాలా మందికి చేతికి వెరైటీ రింగులు పెట్టుకుంటారు. కొందురు రంగురాళ్లు పెట్టుకుంటే.. కొందరు తాబేళు ఉంగరం ధరిస్తారు. అందం కోసం వీటిని వేసుకున్నారు అనుకుంటే పొరపాటే. ఇలాంటివి వేసుకోవడం వెనుక పెద్ద స్టోరీయే ఉంటుంది. వారి జాతకానికి, రాశికి తగ్గట్టు ఏది మంచిదో జ్యోతిష్కులతో చూపించుకోని మరీ వేసుకుంటారు. ఇదంతా ఒక టైప్‌ ఎనర్జీ, వైబ్స్‌లో భాగమే. తాబేలు ఉంగరం ధరించడానికి వెనుక ఉన్న కారణాలు, ఆ ఉంగరం వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం ధరించడం శుభప్రదం. లక్ష్మీ దేవికి ప్రీతికరమైందిగా తాబేలును భావిస్తారు. తాబేలు నాలుగు కాళ్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం, అనుకూలత ఏర్పడుతుంది. ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది. కొన్ని రాశుల వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతారు.

చాలా మంది ఈ ఉంగరం పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఈ ఉంగరం అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందని కొందరు పేర్కొంటున్నారు.

ఈ ఉంగరం మకరరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంటే వేరే రాశుల వాళ్లు వేసుకుంటే వేస్టా అనుకుంటారేమో.. అలా ఏం ఉండదు. ఇలాంటి ఉంగరాలు, రంగురాళ్లు ధరించే ముందు. మీరు కచ్చితంగా పండితుల సలహా తీసుకోవడం ఉత్తమం. మీ రాశికి తగ్గట్టు ఏది మంచిదో చూసి వాళ్లు చెప్తారు. కొన్నిసార్లు మీకు ఇవి చేటు కూడా చేయొచ్చు. కాబట్టి తెలుసుకుని ధరించాలి.

ఈ నాలుగు రాశుల వారు తాబేలు ఉంగరం ధరించకూడదట..

మేష :

మేష రాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించడం మంచిది కాదు. ఒకవేళ ధరించినట్లయితే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కన్యా :

జ్యోతిషశాస్త్రం ప్రకారం కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల తాబేలు ఉంగరం ఈ రాశి వారు ధరించడం వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక రకాల సమస్యలను ఎదురవుతాయి.

వృశ్చిక:

వృశ్చిక రాశికి కూడా అధిపతి అంగారకుడు. ఈ కారణంగా వృశ్చిక రాశి ప్రజలు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజ దోష సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి.

మీనం :

ఈ రాశి ప్రజలకు తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా ధరించకూడదు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీన రాశి వారు ధరించినట్లయితే బృహస్పతి స్థానం బలహీనపడుతుంది. ఫలితంగా ఈ రాశి ప్రజలు ధన నష్టం జరగడమే కాకుండా పలు రకాల ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గమనిక :

ఈ కథనాన్ని మనలోకం ధృవీకరించలేదని గమనించగలరు. కేవలం పండితులు చెప్పిన ఆధారంగానే అందించాం. పాటించాలా లేదా అనేది పూర్తిగా అభిష్టం మీదే ఉంటుంది.!

Read more RELATED
Recommended to you

Latest news