ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వలన చాలా మంది తప్పు బాట పడుతున్నారు. ఇది వరకు అయితే అంతా కలిసి ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వేరేగా వెళ్లిపోవడం వలన కూడ తప్పు బాట పడుతున్నారు. అలానే అందరితో లేకపోవడం వలన అక్రమసంబంధాలు కూడా పెరుగుతున్నాయి.
అందుకనే అంతా కూడ జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే ముందే చూసుకోవాలి. అయితే మరి ఆ మార్పులు ఏమిటి అనేది చూద్దాం. కొన్ని లక్షణాలను బట్టి భార్య లేదా భర్త మరొకరితో రిలేషన్ షిప్ లో వున్నారని మనం తెలుసుకోవచ్చు.
అలంకరణ పై ధ్యాస పెట్టడం:
ఎక్కుడు ఎక్కువగా అలంకరణ పై దృష్టి పెట్టని వాళ్ళు అలంకరణ పైన దృష్టి పెడితే వారు మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నారేమో చూడండి. మీ భార్య లేదా భర్త రొటీన్ గా కాకుండా ఎక్కువగా అలంకరణపై దృష్టి పెడుతున్నట్లు అయితే మీరు వాళ్ళని గమనిస్తూ ఉంటే మంచిది. మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నారేమో తెలుసుకోండి.
ఎక్కువగా ఫోన్ మాట్లాడడం:
ఫోన్ సైలెంట్ గా మాట్లాడటం, మీకు తెలియకుండా ఫోన్ ని మరొక చోట దాయడం, మీకు ఫోన్ ఇవ్వకపోవడం లేదంటే రహస్యాలను తెలుపకూడదని లాక్ పెట్టుకోవడం వంటివి చేస్తే కూడా మీరు వాళ్ళు మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నారేమో అని అనుమానం పడి దాని వెనక కారణం తెలుసుకోండి.
ఎక్కువగా విమర్శించడం:
ఎప్పుడూ విమర్శలు చేయని వారు హఠాత్తుగా విమర్శించడం మొదలుపెట్టినా.. మీరు చేసే ప్రతి చిన్న తప్పు కి కూడా మిమ్మల్ని తిట్టడం ఇటువంటివి చేస్తే మీరు వాళ్ళని గమనించండి. ఒకవేళ ఈ మార్పు మీ భార్య లేదా భర్త లో కనబడితే వాళ్ళని అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు.
ఆఫీస్ నుండి వచ్చాక మళ్లీ బయటికి వెళ్లడం:
తరచూ ఆఫీస్ నుండి వచ్చాక బయటకు వెళ్లడం లేదంటే ఎక్కువ సమయం బయట గడపడం ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళని అనుమానించాలి.