వాస్తు ప్రకారం కొన్నిటిని తప్పక నమ్మాలి..ముఖ్యంగా ఇంటి విషయంలో..ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే సుఖ శాంతులు ఉంటాయని పండితులు అంటున్నారు.సరైన దిశలో, సరైన సమయంలో నాటిన కొన్ని చెట్లు మీ జీవితంలో అనేక అద్భుతమైన, సానుకూల మార్పులను తెస్తాయి. అదే సమయంలో మీకు కీడు కలిగించే చెట్లు కూడా ఉన్నాయి..వాటిని వెంటనే తొలగించకుంటే మాత్రం కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులను కలిగిస్తాయి..
మరి ఇంటి పరిసరాల్లో ఎటువంటి మొక్కలు ఉంటే అశుభమో ఇప్పుడు చుద్దాము..ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది.
చుట్టుపక్కల ఎలాంటి కాక్టస్ మొక్కలను నాటడం మానుకోవాలి. ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉద్రిక్త వాతవరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. చాలా మంది అంలకరణ కోసం ఇలాంటి మొక్కలు నాటుతారు.అస్సలు చెయ్యకండి.. ఇంట్లో బాధలు, చికాకులు పెరుగుతాయి..
రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరిగి ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు.
నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూసుకోవాలి. ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయట. అశుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు..ముళ్ళు ఉన్న పూలు, పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదు ఇది గుర్తుంచుకోవాలి..