తుఫాన్ వల్ల వర్షాలు పడుతున్నాయి.. ఇప్పుడు మొత్తం వరి ధాన్యం కొనకుంటే మిమ్మిల్నే రాళ్లతో కొడుతారని ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ సూచించారు. తాను రైతుల వద్ద కు వెళ్లినప్పుడు తన పై రాళ్ల దాడి చేయించారని అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల పై నే రాళ్ల దాడి చేస్తారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా చాలా మంది రైతుల వరి ధాన్యం తడిసి పోయిందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా రెండు మూడు రోజుల ఆలస్యం అయితే వరి ధాన్యం మొలకెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో రైతులు చాలా నష్ట పోతారని తెలిపారు. ఈ రోజు ఉదయం సిరిసిల్లా నియోజక వర్గంలో వరి ధాన్యం కొనుగొలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సెల్ టవర్ ఎక్కితే వారి పై కూడా టీఆర్ఎస్ నేతలు రాళ్లు తో దాడి చేశారని తెలిపారు. వరి ధాన్యం కొనుగోల్లను వేగవతం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ చేసిన ధర్నా పార్టీ ధర్నానా.. లేక ప్రభుత్వ ధర్నా నా అని విమర్శించాడు. ఈ ధర్న కు పోలీసు యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేసిందని ఆరోపించాడు.