ఇలా చేస్తే ఎక్కిళ్ళు అలా పోతాయ్…!

-

ఎక్కిళ్ల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కొంత మందికి. అసలు వస్తే తగ్గక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా మందికి ఇది ఒక సమస్య కూడా. దీనికి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు తగ్గిపోతాయని అంటున్నారు.

ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు చల్లని నీటిని తాగితే తగ్గిపోతుంది అంటున్నారు. ఎక్కిళ్ళు తగ్గే వరకు కొంచెం కొంచెం నీళ్ళు తాగితే చాలు.

నీరు, తేనె మిశ్రమ౦ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చల్లని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. అందుకే ఎక్కిళ్ళు తగ్గుతాయి. చల్లని నీటికి కాసింత తేనెని కలపి ఆ నీటిని ముందుగా పుకిలించండి.. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.

ఐస్ ముక్కలు కూడా బాగా పని చేస్తాయి. ఓ చిన్న ఐస్ క్యూబ్‌ని నోటిలో పెట్టుకుని నోటితో ఆ నీటిని పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.

ఎక్కిళ్ళు తగ్గడానికి శ్వాసను ఆపడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ముక్కు మూసుకుని కొన్ని సెకన్ల పాటు ఉంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉఛ్వాసలను ఆపడం వల్ల త్వరగా రక్త ప్రవాహంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరిగి.. మనసులో పరధ్యానం ఏర్పడుతుంది.

ఓ చెంచా చక్కెరని తీసుకుని నోట్లో వేసుకుని… మెల్లిగా అందులోనుంచి వచ్చే రసాన్ని మింగుతూ ఉండండి.. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి. పంచదార తినడం వల్ల వేగస్ నరం ఉత్తేజానికి గురై మీ మెదడుని ఎక్కిళ్లని గురించి మరిచిపోయేలా చేస్తుంది.

ఎన్నో అద్భుత గుణాలు ఉండే నిమ్మని తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ నరాలను ప్రభావితం చేయడంతో వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓ చెంచా నిమ్మరసం తీసుకుని… ఈ రసాన్ని అలానే మింగాలి. అలాగే నిమ్మ ముక్కపై ఉప్పు వేసి ఆ రసాన్ని పీల్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news