ఎండాకాలంలో రాగి జావ తాగితే..!

Join Our Community
follow manalokam on social media

ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. టీవీ యాడ్లలో చూసినట్లు సూర్యుడు పిల్లలు, పెద్దల శక్తిని స్ట్రా వేసుకుని తాగేస్తున్నట్లు అయింది పరిస్థితి. రెండు అడుగులు వేయగానే ఎక్కడలేని నీరసం పొంచుకొస్తోంది. ఉత్సాహంగా నడవలేపోతున్నాం.. పని చేయలేకపోతున్నాం. శరీరంలో నీటి శాతం తగ్గడంతోపాటు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకులు జావను చేసుకుని తాగేవారు. మొదట్లో జావాల వాడకం తగ్గవగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత పెరిగింది. జావాలు చేసే ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి వీటి వాడకం పెరిగిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. అయితే జావను ఎన్నోరకాలుగా తయారు చేసుకోవచ్చు. అవేంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

ragi-malt
ragi-malt

రాగిజావ..
ఎండాకాలంలో అధిక సమస్య తినబుద్ధి కాకపోవడం. ఎంతో ఇష్టంగా తినే ఫుడ్స్‌ను సైతం పక్కన పెట్టేస్తాం. ఎంత ఆహారం తిన్నా.. దాని ముందు చల్లటి నీళ్లే ఎంతో టేస్టీగా అనిపించే సందర్భాలు చాలా మందికి తారస పడి ఉండొచ్చు. ఆహారం తినాలని అనిపించనప్పుడు రాగిజావ తయారు చేసుకోవడం ఎంతో ఉత్తమం. రాగిజావను ఇంట్లోనే ఉండి తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు మాత్రమే. ముందుగా రెండు చెంచాలు రాగిపిండిని కప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు వేసి.. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్లు కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల ముక్కలు వేసుకుని దింపేయాలి. వేడి తగ్గకన్న ముందే బౌల్‌లో జావను తీసుకుని అందులో పెరుగు కలుపుకొని తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక వేళ రాగిజావ కాస్త తియ్యగా చేసుకోవాలంటే రాగి పిండిలో బెల్లం ముక్క వేసుకుని అరగ్లాసు పాలు కలిపి ఉడికించుకోని తాగాలి.
ఉపయోగాలు..
రాగుల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు ఏ, బీ, సీ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

బార్లీజావ..
ఒక కప్పు బార్లీ గింజను ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి కలుపి.. తాగేటప్పుడు నిమ్మరసం వేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచి కావాలంటే దానిమ్మగింజలు కూడా వేసుకోవచ్చు. బార్లీజావలో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే త్వరగా ఆకలి వేయదు. బరువును నియంత్రిస్తుంది. జలుబు వంటి సమస్యలు దరిచేరవు.

TOP STORIES

శ్రీరామనవమి అంటే రాముని పుట్టిన రోజా? పెళ్ళి రోజా ?

శ్రీరామ నవమి అంటే చాలు అందరికీ పండుగే. ఆ సుగణభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. మరి నిజంగా ఆరోజే...