ఈ భూమ్మీద మనిషి తినేందుకు ప్రకృతి ఎన్నోరకాల ఆహారపదార్ధాలను అందించింది. అందులో కూరగాయలు, ఫ్రుడ్స్ మొదట ఉంటాయి. పండ్లలో గ్రీన్ ఆపిల్ గురించి మీరు ఎప్పుడైన విన్నారా. శరీరానికి అవసరమైన పోషకాలు మరియు చాలా విటమిన్లు ఉంటాయి. క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మా సమస్యను నిరోధించవచ్చు.
సాదారణంగా రెడ్ మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని, తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘకాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా దీనికి పేరుంది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం , బిపీ తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం, ఆకలి మెరుగుపరచడం వంటి వాటికి గ్రీన్ ఆపిల్ ఉపయోగపడుతుంది.
గ్రీన్ యాపిల్స్ ను చాలా మంది పచ్చి యాపిల్ గా అనుకుంటారు. ఆకుపచ్చ రంగులో నిగనిగ లాడుతూ కనిపించే ఈ గ్రీన్ యాపిల్ ఆస్ట్రేలియాకు చెందిన యాపిల్. సిమ్లా యాపిల్ పండులా గ్రీన్ యాపిల్ లో తియ్యగా ఉండదు.. కొంత వగరుగా ఉంటుంది. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంతరించుకుందంటారు.
బరువు తగ్గాలని అనుకొనే వారికీ ఇది గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. ఇది రక్తనాళాలలో కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం, గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. ఆపిల్ ను కొంతమంది తోలుతీసి తింటారు. కానీ తోలుతోసహా తినటం మంచిది.
ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం మొదలైన ఖనిజాలను ఈ ఆపిల్ కలిగి ఉంటుంది. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడానికి అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి ఉపకరిస్తుంది. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని నిరోధిస్తుంది. కీళ్లవ్యాధులను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడంట్ మీ కాలేయం రక్షించడానికి సహయపడతాయి.
గ్రీన్ యాపిల్ లో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్ని నిరోధించడంలో ఉపయోగపడుతుంది. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గ్రీన్ యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న గ్రీన్ ఆపిల్స్ ను మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే..ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలకు అడ్డుకట్ట వేసినట్లే.!