లవ్ టుడే హీరోయిన్ ఇవానా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

గత ఏడాది అలరించిన సినిమాలలో లవ్ టుడే సినిమా కూడా ఒకటి. తమిళ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా చేసుకోని..ఈ సినిమాను ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయనే హీరోగా చేసి మెప్పించడం జరిగింది. మరి ఇందులో హీరోయిన్గా నటించిన ఇవానా సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమాలో సత్యరాజ్, రాధిక కీలకపాత్రను పోషించారు. తెలుగు, తమిళ్ భాషలో విడుదలై మంచి హిట్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా వినోదాన్ని అందిస్తోంది. ఇకపోతే ఇవానా అందానికి, నటనకు ఫిధా అయిన ప్రేక్షకులు చూడముచ్చటైన ఆమె రూపం చూసి యువత మోహితులవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎవరు అంటూ గూగుల్లో తెగ గాలిం చేస్తున్నారు యువత.. ఇవానా అసలు పేరు అలీనా షాజీ.. ఈమె తన పేరును పలకడానికి ఇతరులకు కష్టంగా ఉండడంతో ఇవానాగా మార్చుకుంది. కేరళకు చెందిన ఈ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు . 2018 లోని తమిళ్ డబ్బింగ్ చిత్రం ఝాన్సీ తో తెలుగులో పరిచయం అయింది . ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో కనిపించింది ఇవానా.

అలాగే మాస్టర్స్ 2012లో వచ్చిన మలయాళం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయింది
చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. మరి ఈమెకు ఇప్పుడు తెలుగులో కూడా గుర్తింపు లభించింది కాబట్టి ఇక్కడ కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. త్వరలోనే తెలుగులో మరో యంగ్ హీరోకి జోడిగా సినిమా చేయబోతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news