కృష్ణ అందుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎంత గొప్ప నటుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించాడు. ఇక అంతే కాకుండా తన కుమారుడు మహేష్ బాబు కూడా తన తండ్రి లాగానే సరికొత్త కథల తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వన్ స్టార్ హీరో గా కొనసాగుతున్నారు మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబు సోదరి అయినటువంటి మంజులతో కృష్ణ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది . అందులో కొన్ని విషయాలను తెలియ జేశారు.A biopic on Superstar Krishna?సూపర్ స్టార్ కృష్ణ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరియర్ లో ఎన్టీఆర్ ,ఏఎన్నార్ ,శోభన్ బాబు వంటి ఎంతో మంది నటులు తనకు మంచి స్నేహితులు అని తెలియజేశారు. తేనె మనసులు సినిమా నుంచి తన లో చాలా మార్పు వచ్చినట్లుగా తెలియజేశారు. పద్మాలయ స్టూడియో బ్యానర్ పై ఎన్నో అత్యధిక భారీ చిత్రాలను తెరకెక్కించి.. మంచి విజయాలను అందుకున్నారు అని తెలిపారు. తను హీరో అయ్యాక మొట్టమొదటిసారిగా గూడచారి -116 చిత్రానికి గాని అడ్వాన్స్ ఇచ్చిన మొత్తము రూ.1000 రూపాయలని తెలియజేశారు. తనకి తన కుటుంబంతో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టమని అందుచేతనే ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడూ మిస్ కానని తెలిపారు.Gudachari 116 - Wikipediaఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పుకుంటే ఈ నెల 31వ తేదీ ఆయన పుట్టిన రోజు కావడం చేత ఈ వీడియోని విడుదల చేయబోతోంది కూతురు మంజుల. అంతేకాకుండా మొట్టమొదటి జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను తెరకెక్కించారు కృష్ణ. మొట్టమొదటిసారిగా 70MM మూవీ ని విడుదల చేసింది సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. ఒక్క ఏడాది లోనే అత్యధిక భారీ చిత్రాలను తెరకెక్కించి విడుదల చేసిన ఘనత కూడా కృష్ణదే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news