సినీ ఇండస్ట్రీలో హీరోలకు , దర్శక నిర్మాతలకు మాత్రమే కాదు హీరోయిన్లకు కూడా ప్రత్యేకంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇక ఆ సెంటిమెంట్ ని ఫాలో అయితేనే సక్సెస్ సాధిస్తామనే నమ్మకం కూడా ఈ స్టార్ హీరోయిన్లకు ఉంటుంది. ఇక అలాంటి వారిలో ఇటీవల ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత ఉప్పెనలా వరుస సినిమాలలో నటిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. శ్యామ్ సింగారాయ్, బంగార్రాజు, ది వారియర్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. ప్రస్తుతం నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది.అంతేకాదు తమిళ్లో కూడా రెండు మూడు చిత్రాలలో నటిస్తోంది అన్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా కృతి శెట్టికి కూడా ఒక సెంటిమెంట్ ఉందని ఆ సెంటిమెంట్ ఫాలో అయితే తప్ప తన కెరియర్ సక్సెస్ కాదనే నమ్మకంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. మరి కృతి శెట్టి నీ వెంటాడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇక కృతి శెట్టి కి ఉన్న సెంటిమెంట్ విషయానికి వస్తే.. తన రియల్ లైఫ్ లో కాదు కానీ సినిమాలలో మాత్రమే ఆ సెంటిమెంట్ను పాటిస్తుందని తెలిసింది.
ముఖ్యంగా తాను ఏ సినిమాలో నటించినా సరే ఆ సన్నివేశం లేకపోతే ఆ సినిమా ఆమె చేయదని సమాచారం. ఇక ఆ సెంటిమెంట్ ఏదో కాదు తనను బైక్ మీద ఎక్కించుకొని తిప్పాలి.. అది కూడా హీరో మాత్రమే.. అంతేకాకుండా దారిలో నాలుగు స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండాలి.. ఇక ఇవి ఉంటేనే ఆమె ఆ సినిమాలో నటిస్తుందనే విషయం బాగా వైరల్ అవుతోంది.