రూ.10 చెల్లిస్తే.. ఇంటిపై స‌ర్వ‌హక్కులు : జ‌గ‌న్ అదిరిపోయే శుభ‌వార్త‌

వన్ టైం రిజిస్ట్రేషన్ పథకం ద్వారా కేవలం పది రూపాయలు చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ” కేవలం పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఉచితంగా డాక్యుమెంట్లు ఇస్తున్నాము. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండానే క్రయవిక్రయాలు చేయవచ్చు. పుట్టిన రోజున మంచి పని ప్రారంభిస్తున్నాం. పేద వారికి మంచి చేస్తుంటే ఎక్కువగా చూపించుకో లేకపోతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు పథకాన్ని తొలగిస్తున్నాము” అని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామ‌ని.. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని వెల్ల‌డించారు. లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని.. ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామ‌ని చెప్పారు. ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదన్నారు..
ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిల్ ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు.