కేటీఆర్ పై ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కాబోయే సీఎంనని చెప్పుకోడానికి సిగ్గుండాలి !

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప‌ర్య‌టించిన వైఎస్ ష‌ర్మిల‌… మంత్రి కేటీఆర్ పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇలాఖాల్లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు సిగ్గు చేట అని మండిప‌డ్డారు. ఇక్క‌డికి రాకుండా గ్రామ‌స్తుల‌ను బెదిరించే హ‌క్కు కేటీఆర్ కు ఎక్క‌డిది ? అని ప్ర‌శ్నించారు. మీ సత్తాలేని పాల‌న‌ వల్లే రైతుల ఆత్మహత్యలు, ఇంగితమే ఉంటే రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేన‌ని, మంత్రినని, కాబోయే CM నని చెప్పుకోడానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిల‌. సీఎం కేసీఆర్‌ రైతు ద్రోహి అని… రైతుల మరణాలకు కేసీఆరే కారణమ‌ని ఫైర్ అయ్యారు. సీఎం పదవికి ఆయన అనర్హుడు.వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘వ‌రి వ‌ద్ద‌న్న ముఖ్య‌మంత్రి మ‌న‌కొద్దు’ ఇదే మన నినాదం కావాలని.. పరిపాలన చేతకాక గల్లీల్లో ధర్నాలు, ఢిల్లీల్లో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్ర‌హించారు. చావుడప్పు కొట్టాల్సింది కేసీఆర్ ప్రభుత్వానికేన‌ని ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిల‌..