తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.- పియూష్ గోయల్

-

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ నేతలు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పియూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తుందని విమర్శించారు. రైతులతో రాజకీయ చేస్తుందన్నారు. తెలంగాణలో గత ఐదేళ్లలో ధాన్యం సేకరణను 3 రెట్లు పెంచామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు ఎక్స్ టెన్షన్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వ రబీ ధాన్యాన్ని డెలవరీ చేయలేదన్నారు.  గత రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను అదనంగా కొనేందుకు ఒప్పందం చేసుకున్నామని గోయల్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ సీఐకి తరలించాలి కానీ తరలించలేదనన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పంద జరిగిందన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్రమే కేంద్రానికి లేఖ రాసిందని వెల్లడించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పియూష్ గోయల్ అన్నారు. బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు తెలంగాణలోని విషయాలను కేంద్రం ద్రుష్టికి తీసుకువస్తోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news