ఒకసారి ఆలయానికి వెళ్లి కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఒత్తిడి లేకుండా హాయిగా అనిపిస్తుంది. సమస్యలేమి లేనట్లు ప్రశాంతత భావన మనలో కలుగుతుంది. మీరు కూడా అందుకే దేవాలయానికి వెళుతూ ఉంటారా..? దేవుడుని పోషించిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని కోరికలు చెప్పుకుని తర్వాత కాసేపు గుళ్లో కూర్చుంటారా..? నిజంగా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఆనందం కలుగుతుంది. అయితే ఎప్పుడైనా మీరు గుడిలో గమనించినట్లయితే గుడిలో చాలా మంది రాళ్ళ అనే పేరుస్తూ ఉంటారు.
ఒక రాయి మీద ఒక రాయిని అలా ఎత్తుగా కడుతూ ఉంటారు. అయితే దీని వెనుక అర్థం ఏమిటంటే.. ఎంత ఎత్తుగా పేరిస్తే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకుంటారని ఇలా నమ్మే చాలా మంది దేవాలయాల్లో రాళ్ళని పేరుస్తూ ఉంటారు. అయితే నిజంగా దేవాలయాల్లో మనం ఇలా పేరిస్తే ఇల్లు ని కట్టుకోగలమా దాని వెనుక కారణం ఏమిటి ఎందుకు పేరుస్తారు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు.
సొంత ఇల్లు కట్టుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి కొన్ని దేవాలయాల పరిసరాల్లో రాళ్లు పేర్చితే గృహ యోగం కలుగుతుందని అంతా నమ్ముతారు పైగా రాళ్లతో ఎంత ఎత్తు కడితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకోవచ్చని అనుకుంటారు. అయితే అలా చేస్తే నిజంగా ఇల్లు కట్టుకోవచ్చా లేదా అనేది పక్కన పెడితే సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచన మంచిది. అందులోనూ దేవాలయాలకు వచ్చి అలా కోరుకోవడం వలన మంచి కలుగుతుంది. పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పెరుస్తే గృహ యోగం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఇలా ఆలోచించడం చాలా మంచిది. ఇల్లు కట్టాలని అనుకుని.. దాని కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పూర్తవుతుంది.