ఈ రోజుల్లో చాలామంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాలలో క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది క్యాన్సర్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారట. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం స్మోకింగ్, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం వలన క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు.
వ్యాయామం చేస్తే కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు అయితే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మంచి పోషకాలను తీసుకోవాలి. విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యారెట్లు పండ్లు పాలకూర బ్రోకలీ నట్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉండండి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే విటమిన్ డి కూడా తీసుకోవాలి. విటమిన్ డి వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎముకలు బలంగా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
విటమిన్ డి సప్లిమెంట్స్ ని తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది అదేవిధంగా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే విటమిన్ కే వుండే ఆహార పదార్థాలు కూడా తీసుకోండి విటమిన్ కె ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే కూడా క్యాన్సర్ రాదు. విటమిన్ బి మెగ్నీషియం ని కూడా తీసుకుంటూ ఉండండి. విత్తనాలు ధాన్యాలు ఆకుకూరల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చేపలు తృణధాన్యాలు చిక్కుళ్ళు వంటి వాటిలో విటమిన్ బి ఉంటుంది ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు.