మహిళా ఉద్యోగి వక్షోజాలపై కామెంట్‌… 13 కోట్ల నష్టపరిహారం

-

ఆఫీసులో పనిచేసే తోటి మహిళా ఉద్యోగిపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె వక్షోజాలపై కామెంట్‌ చేశాడు. దీంతో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీ స్విస్‌ రే (Swiss Re) కు చెందిన సీనియర్‌ మేనేజర్‌.. ఓ మహిళా ఉద్యోగిపట్ల లింగ వివక్ష చూపుతూ ఆమె రొమ్ముల పరిమాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక, సరైన కారణం తెలుపకుండానే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.

What you should know about sexual harassment in the workplace | Mint

మేనేజర్‌ వ్యాఖ్యలతో ఆమె మానసికంగా వేదన అనుభవించారు. సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె ఆర్థికంగా కూడా నష్టపోయారు. దాంతో బాధితురాలు న్యాయం కోసం లండన్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ ఆమెకు రూ.13 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. స్విస్‌ రే ఇన్సూరెన్స్‌ కంపెనీ లండన్‌ బ్రాచ్‌లో 2017లో జూలియా సోమర్‌ అనే మహిళ పొలిటికల్‌ రిస్క్‌ అండర్‌ రైటర్‌గా ఉద్యోగంలో చేరారు. 2021లో డెలివరీ కోసం సెలవులు తీసుకుని వచ్చిన తర్వాత ఆమె బాగా లావయ్యారు. దాంతో ఆమె బరువును గురించి పలుమార్లు కామెంట్‌ చేసిన సీనియర్‌ మేనేజర్‌ ఆఖరికి అర్ధాంతరంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు. దాంతో ఆమె తనకు రావాల్సిన బోనస్‌ను కూడా కోల్పోయారు.

ఈ క్రమంలో బాధితురాలు లండన్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. స్విస్‌ రే కంపెనీ ఎలాంటి కారణంగా చూపకుండానే తనను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తాను వేతనాన్ని మాత్రమేగాక, కంపెనీ నిబంధనల ప్రకారం తనకు రావాల్సిన బోనస్‌ను కూడా కోల్పోయానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక 2017లో వర్క్‌ బ్రేక్‌లో డ్రింక్స్‌ తీసుకుంటుండగా బాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news