తిప్పతీగ రసాన్ని రోజు తీసుకుంటే ఈ సమస్యలన్నీ మాయం..!

-

ఆయుర్వేద మందులులో విరివిగా తిప్పతీగని కూడా వాడుతూ ఉంటారు. తిప్పతీగ వల్ల నిజానికి చాలా లాభాలను మనం పొందొచ్చు. తిప్పతీగ ని సంస్కృతం లో అమృత అంటారు. ఎన్నో సమస్యలను ఇది తొలగిస్తుంది.

 

తిప్పతీగ లో ఫ్లెవనాయిడ్స్, కార్బోహైడ్రేట్స్ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి అలానే 11 గ్రాముల ఫైబర్, రెండు గ్రాముల ప్రోటీన్, మూడు గ్రాముల కార్బోహైడ్రేట్స్, 303 మైక్రోగ్రాముల విటమిన్ ఏ తో పాటుగా క్యాల్షియం, విటమిన్ సి కూడా మనకి అందుతుంది. అలానే ఐరన్ కూడా ఇందులో ఉంటుంది. చాలా మంది తిప్పతీగ జ్యూస్ ని చేసుకుని తీసుకుంటుంటారు. నిజానికి తిప్పతీగ రసం తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

తిప్పతీగ లో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా వంటివి ఒంట్లో ఉండకుండా ఇది చేస్తుంది. అలానే రక్తాన్ని శుభ్రపరుస్తుంది కూడా.

డయాబెటిస్ సమస్యను తగ్గిస్తుంది:

తిప్పతీగ హైపో గ్లైసెమిక్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీంతో టైప్2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి చక్కటి రిలీఫ్ వస్తుంది.

ఆర్థరైటిస్ ని తగ్గిస్తుంది:

ఆర్థరైటిస్ ను తగ్గించే గుణాలు కూడా తిప్పతీగ లో ఉన్నాయి. తిప్పతీగ రసం తాగితే ఈ సమస్యలు కూడా ఉండవు. అలానే వయసు పై పడిపోకుండా ఇది చేస్తుంది. పింపుల్స్, యాక్ని వంటి వాటిని కూడా తొలగిస్తుంది.

కంటి ఆరోగ్యానికి మంచిది:

తిప్పతీగ రసం తాగడం వల్ల కంటికి కూడా చాలా మేలు కలుగుతుంది. తిప్పతీగ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి.

డెంగ్యూ జ్వరం లక్షణాలను తగ్గిస్తుంది:

తిప్పతీగ రసం తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది అలాగే డెంగ్యూ జ్వరం లక్షణాలు తగ్గుతాయి. ఇలా ఎన్నో లాభాలు మనం తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news