క‌రెంటు కోత‌లు : ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు షాక్.. వారానికి రెండు ప‌వ‌ర్ హాలీడేస్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని క‌రెంటు కోత‌లు ఇబ్బంది పెడుతుంది. ఇప్ప‌టికే రోజుకు దాదాపు 6 గంట‌ల పాటు క‌రెంటు క‌ట్ అవుతుంది. అయినా.. విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప‌రిశ్ర‌మ‌కు రాష్ట్ర ట్రాన్స్ – కో షాక్ ఇచ్చేలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో మూడు డిస్కం ప‌రిధిలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌ట‌న చేసింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తి వారం ఒక్క రోజు ప‌వ‌ర్ హాలీడే ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా.. వారంత‌పు సెల‌వు కు ఈ ప‌వ‌ర్ హాలీడే అద‌నంగా ఉంటుంద‌ని వెల్ల‌డించింది. దీంతో చిత్తూర్, క‌డ‌ప‌, అనంత‌పూరం, నెల్లూర్, క‌ర్నూల్ జిల్లాల్లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి రెండు ప‌వ‌ర్ హాలీడే స్ రాబోతున్నాయి. ఏపీ ట్రాన్స్ – కో తీసుకున్న ఈ నిర్ణ‌యం ఈ రోజు నుంచి ఏప్రిల్ 22 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది.

ఏప్రిల్ 22 త‌ర్వాత‌… అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగూణంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఏపీ ట్రాన్స్ – కో వెల్ల‌డించింది. రాష్ట్రంలో మొత్తం 1,696 ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి రెండు రోజుల ప‌వ‌ర్ హాలీడేస్ ఉంటాయని తెలిపింది. అలాగే 253 ప్రాసెసింగ్ పరిశ్ర‌మ‌లు కూడా 50 శాతం క‌రెంటును వాడుకోవాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news