బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా వీటిని ఫాలో అవ్వండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది బాగా బరువు పెరిగి పోతున్నారు. నిజానికి బరువు పెరిగిపోవడం వల్ల చాలా సమస్యలు కలుగుతాయి. అయితే మీరు కూడా బాగా బరువుగా ఉన్నారా…? బరువు తగ్గడానికి చూస్తున్నారా..? అయితే తప్పకుండా వీటిని ప్రతిరోజు ఫాలో అవ్వండి.

 

వీటిని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే బరువు కూడా తగ్గుతారు. అయితే మరి బరువు తగ్గడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి అనేది ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం.

ఫిజికల్ యాక్టివిటీ ని పెంచండి:

ఫిజికల్ యాక్టివిటీ బరువును తగ్గిస్తుంది. వర్క్ అవుట్స్ చేయడం వల్ల ఆరోగ్యం నిజంగా బాగుపడుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ప్రతిరోజు 30 నిమిషాలపాటు వర్కౌట్ చేయడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది. సైక్లింగ్, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి మీరు ప్రయత్నం చేయొచ్చు.

ఆహారాన్ని లిమిట్ గా తీసుకోండి:

మీరు కనుక ఆహారాన్ని కంట్రోల్ లో ఉంచుకుంటే అప్పుడు ఖచ్చితంగా బరువు తగ్గడానికి అవుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారాన్ని తగ్గిస్తే కూడా బరువు తగ్గడానికి అవుతుంది.

యాడెడ్ షుగర్:

మీరు కనుక బరువు తగ్గాలి అనుకుంటే షుగర్ ని కట్ చేయడం చాలా అవసరం. షుగర్ ని ఉపయోగించడం వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మీరు షుగర్ కి బదులుగా ఇతర పదార్థాలను ఉపయోగించడం మంచిది.

ఆల్కహాల్ తీసుకోవద్దు:

బరువు తగ్గాలంటే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల కూడా బరువు పెరిగిపోతారు. ఎందుకంటే అందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలానే నిద్ర కూడా పట్టదు. ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి బరువును మెయింటైన్ చేయాలన్నా ఆల్కహాల్ కి దూరంగా ఉండండి.

సురక్షితమైన డైట్ ప్లాన్ ని పాటించండి:

సురక్షితమైన డైట్ ప్లాన్ ను పాటించడం కూడా ఆరోగ్యానికి మంచిది. మీ డైట్ లో ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలానే మీ డైట్ లో రైస్, గోధుమలు, ఓట్స్ వంటివి తీసుకోండి. వీటి వల్ల కూడా బరువు తగ్గడానికి అవుతుంది. చూశారు కదా ఎలాంటి చిట్కాలను అనుసరించడం వల్ల బరువు తగ్గొచ్చు అనేది. మరి ఇక్కడ చెప్పిన విధంగా అనుసరించి బరువు తగ్గి ఆరోగ్యంగా కూడా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news