విద్యార్థులకు గుడ్‌ న్యూస్..ఏపీ ఎంసెట్ లో ఇంటర్‌ వెయిటేజీ తొలగింపు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త అందించింది. ఏపీ ఎంసెట్‌ పరీక్షలపై ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ లో ఇంటర్‌ వెయిటేజ్‌ తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది ఏపీ విద్యా మండలి. ప్రతీ ఏటా ఇంటర్‌ మార్కులు ఆధారంగా ఎంసెట్‌ పరీక్షకు 25 శాతం వెయిటేజ్‌ ఇస్తున్న విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్‌ క్లాసులు సరిగా జరుగలేదు. దీంతో విద్యార్థులు సెలబస్‌ ను చాలా మిస్‌ అయ్యారు. దీంతో ఈ ఏడాది కూడా ఏపీ ఎంసెట్‌ లో ఇంటర్‌ వెయిటేజ్‌ తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది ఏపీ విద్యా మండలి. ఈ రూల్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు సిద్ధమయ్యే అందరూ విద్యార్థులకు వర్తించనుంది. గత ఏడాది కూడా ఇలాగే ఎంసెట్‌ పరీక్షలు జరిగాయి. కాగా.. జులై 4 వ తేదీన నుంచి 12 వ తేదీ వరకు ఏపీ ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news