చాణక్య నీతి ద్వారా ఆచార్య చాణక్య ఎన్నో విషయాలను తెలిపారు. జీవితంలో ఏ విధంగా ఉంటే సమస్యలు వస్తాయి అనేది చాణక్య ఎంతో చక్కగా చెప్పారు. పైగా వివాహం గురించి, స్త్రీ పురుషులు గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను చాణక్య నీతి ద్వారా చాణక్య తెలిపారు. అయితే ఈ స్వభావం కలిగిన స్త్రీలు తన భర్తని బాగా చూసుకుంటారని చెప్తున్నారు. అయితే మరి మీ భార్య కూడా ఈ స్వభావం కలిగి ఉన్నారా అనేది చూడండి.
నిజానికి ఇటువంటి గుణాలు ఉండే భార్య కనుక దొరికితే ఆ పురుషులు చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఎంతో ప్రేమగా తన భర్తని చూసుకుంటారు. పైగా అటువంటి భార్య వలన భర్తకు ఎలాంటి సమస్యలు కలగవు. ఎవరికి కూడా స్వార్థం, అసూయ, అబద్ధాలు చెప్పడం వంటి చెడు గుణాలు ఉండకూడదు. ఏ భార్యలకు కూడా అసూయ ఉండడం, స్వార్థం, మూర్ఖంగా ఉండడం, పరిశుభ్రత లేకుండా ఉండడం, క్రూరంగా ఆలోచించడం వంటివి ఉండకూడదు. ఇటువంటి ఈ గుణాలు ఉంటే భర్తకు కూడా ఇబ్బంది కలుగుతుంది.
కుటుంబం కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అదే విధంగా భార్య అందహీనంగా వున్నా పరవాలేదు కానీ మంచి కుటుంబానికి చెందిన స్త్రీ అయ్యేటట్టు చూసుకోవాలి. మంచి కుటుంబం నుండి వచ్చే స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోవాలి లేదంటే ఆ భార్య కి చెడు గుణాలు ఉంటాయి. మర్యాద ఇవ్వడం తెలియదు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు కాబట్టి మర్యాద ఎలా ఇవ్వాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి వంటివి తప్పక స్త్రీలకి తెలిసి ఉండాలి. అటువంటి వాళ్ళని మాత్రమే వివాహం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి లక్షణాలు ఉండే స్త్రీని మాత్రమే వివాహం చేసుకోండి. నిజానికి ఇటువంటి లక్షణాలు మీ భార్యలో ఉంటే మీరు ఎంతో అదృష్టవంతులు.