యాదగిరిగుట్టకు ఐజిబిసి గుర్తింపు లభించింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు లభించింది. మూలవరులను ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిల తో ప్రధాన ఆలయ పునర్నిర్మాణం, కొండ చుట్టూ పచ్చదనం, నీటి శుద్ధి నిర్వాహన, విద్యుత్తు వినియోగం, ప్రసాదాల తయారీపై 2022-2025 సంవత్సరానికి గాను ఐజిబిసి గ్రీన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రేటింగ్ సిస్టం కింద సర్టిఫికెట్ వరించినట్టు ఆ సంస్థ ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు.
ఈనెల 20న హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో సర్టిఫికెట్ ప్రధానం చేస్తామని పేర్కొన్నారు. గౌరవప్రదమైన సర్టిఫికెట్ ను వైటీడిఏ అధికారులు అందుకోనున్నారు. వర్షపు నీటిని ప్రత్యేకమైన కాలువల ద్వారా చెరువులకు మళ్లించే స్టామ్ వాటర్ డ్రైన్ పద్ధతి తో పాటు అధునాతన ట్యాప్, పైపుల వినియోగం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్న విధానం బాగున్నదని ప్రవీణ్ అభినందించారు.