షూట్ లో ఇలియానా చేతికి గాయం.. అసలేమయింది ?

పోకిరి భామ ఇలియానా తన అభిమానులకు షాక్ ఇచ్చింది. అదేంటంటే షూటింగులో భాగంగా తను గాయపడ్డానని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఆమె పెట్టిన ఫోటోలు ప్రకారం ఆమె అరచేతి కి చిన్న గాయం అయింది. దీంతో ఆమె రెండు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అలాగే దానికి ఆసక్తికర కామెంట్ అని ఆమె జోడించింది. అదేంటంటే రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయ పడతారు ? అంటూ సరదాగా పేర్కొంది. అలానే తన గాయం చూసి అభిమానులు ఎక్కడ కంగారు పడతారో అని మళ్ళీ ఆమె ఐ యాం ఫైన్ అంటూ రాసుకొచ్చింది.

నిజానికి ఏవైనా యాక్షన్ సీక్వెన్స్ లు గాని, ఫైట్ లు గాని, లేదా ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే నటీమణులు గాయ పడుతూ ఉంటారు. అలాంటిది ఈమె రొమాంటిక్ కామెడీ సినిమాలో ఎందుకు గాయపడింది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఈమె చేస్తున్న ఈ సినిమా పేరు అన్ ఫెయిర్ అండ్ లవ్లీ కాగా ఈ సినిమాలో ఆమె రణదీప్ హుడా సరసన నటిస్తోంది. బల్విందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇలియానా నల్లగా ఉండే అమ్మాయి పాత్ర పోషిస్తోంది. హర్యానా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.