వ్యర్ధాలతో కూడిన చెరువులో నిమజ్జనం చేయడం మహా పాపం – భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

-

వ్యర్ధాలతో కూడిన చెరువుల్లో నిమర్జనం చేయడం మహా పాపమని అన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు. హుస్సేన్ సాగర్ లో వినాయకుని నిమర్జనంకు ప్రభుత్వం తక్షణమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఆదేశాల పేరుతో తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. గణేష్ నిమర్జనం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.

మరోవైపు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న వినాయక విగ్రహాల నిమర్జనాలకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మహంజాహీ మార్కెట్ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వినాయక నిమర్జనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ లో బిజెపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news