IPL 2024 : ముంబై అభిమానులకి గుడ్ న్యూస్… సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడు ?

-

ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసి కెప్టెన్గా ప్రకటించిన నాటి నుండి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఆడిన అన్ని మ్యాచ్లో నువ్వు కూర అవ్వటమే చవిచూసింది.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఐపీఎల్ సీజన్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడు గాయం నుంచి కోలుకుని ఫిట్గా ఉన్నట్లు బెంగళూరు NCA ప్రకటించినట్లు సమాచారం. వచ్చే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్లో సూర్య ఆడనున్నట్లు తెలుస్తోంది. సూర్య రాకతోనైనా ఆ జట్టు గాడిలో పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్న అతడు జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం NCA వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా, ఐపీఎల్‌లో 139 మ్యాచులు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 3249 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా సంవత్సరాలుగా ముంబైకి ఆడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news